- టీ 20 వరల్డ్ కప్‌లో తక్కువ స్కోర్లు నమోదు
- రూ.240 కోట్లతో నిర్మాణం
- వరల్డ్ కప్ కాగానే నేలమట్టం
Nassau County International Stadium: టీ20 వరల్డ్ కప్ కోసం న్యూయార్క్‌లో నాసౌ కౌంటీ క్రికెట్ స్టేడియాన్ని కొత్తగా నిర్మించారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇందు కోసం ఏకంగా రూ.240 కోట్లు ఖర్చు చేసింది. ఈ స్టేడియాన్ని కేవలం మూడు నెలల్లోనే నిర్మించడం గమనార్హం. 34 వేల సీటింగ్ సామర్థంతో స్టేడియాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది ఐసీసీ. ఈ స్టేడియంలోని పిచ్‌లను మరో చోట రెడీ చేసి డ్రాపింగ్ పద్ధతిలో ఇక్కడ అమర్చారు. ఇక్కడ ఇప్పటి వరకు పలు మ్యాచులు నిర్వహించారు. ఏ మ్యాచులోనూ 140 మంచి స్కోరు నమోదు కాలేదు. ప్రతి మ్యాచులోనే తక్కువ స్కోర్లే నమోదు కావడం గమనార్హం.
టీ20 వరల్డ్ కప్ కోసం తాత్కాలికంగా నిర్మించిన ఈ స్టేడియాన్ని టోర్నీ ముగిసిన వెంటనే నేలమట్టం చేసేయనున్నారు. ఇక్కడ ఏడు మ్యాచులు నిర్వహించనున్నారు. కేవలం ఏడు మ్యాచుల కోసం ఏకంగా రూ.240 కోట్లు ఖర్చు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అమెరికాలో క్రికెట్‌కు ఆదరణ పెంచే క్రమంలో స్టేడియాన్ని నిర్మించారని తెలుస్తోంది. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను భాగం చేసేందుకు ఐసీసీ ఖర్చుకు వెనుకాడడం లేదు. అందులో భాగంగానే ఈ స్టేడియాన్ని నిర్మించారు. కాగా ఇంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన స్టేడియం వరల్డ్ కప్ తరువాత ఉండదంటే క్రికెట్ అభిమానుల మనస్సు అంగీకరించడంలేదు. ఇంత ఖర్చు చేయడం దేనికి అనే ప్రశ్నలు సంధిస్తున్నారు.