Selection for national level handball competitions: ధర్మపురి, జనవరి 3 (మన బలగం): పెద్దపల్లి జిల్లా, ధర్మారం మండల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ విభాగంలో మొదటి సంవత్సరం చదువుతున్న గుల్లకోటకు చెందిన మడ్డి వంశీ అక్టోబర్ 03 నుంచి 5వ తేదీ వరకు మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన ఎస్‌జీఎఫ్ యూ-17 హ్యాండ్ బాల్ రాష్ట్రస్థాయి పోటీలో కరీంనగర్ జిల్లా జట్టు తరఫున పాల్గొని సిల్వర్ మెడల్ సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ దురిశెట్టి అనంత రామకృష్ణ, అధ్యాపకులు విద్యార్థిని శాలువాతో సన్మానించి అభినందించారు.