MLA Maheshwar Reddy: నిర్మల్, డిసెంబర్ 22 (మన బలగం): నర్సాపూర్ మండల కేంద్రంలో శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి కళ్యాణం (దేవుని చెరువు జాతర)లో పాల్గొని ఆలయంలో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, బీజేపీ నాయకులు రావుల రాంనాథ్, మెడిసమ్మె రాజు, తక్కల రమణ రెడ్డి, దత్తురాం, నరేందర్, సవీన్, గంగారాం, సాయన్న, సుధాకర్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.