Muthyampet Navratri celebrations: మల్యాల మండలంలోని ముత్యంపేట గ్రామంలో దేవీ శరన్నవరాత్రులు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. భారీ ఊరేగింపుగా నిర్వహించి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. డప్పు చప్పుళ్ల మధ్య, వాగ్దేవి పాఠశాల విద్యార్థుల కోలాల మధ్య అమ్మవారి ఊరేగింపు కొనసాగింది. స్థానిక హనుమాన్ ఆలయం వద్ద విగ్రహాన్ని ప్రతిష్టించారు. విగ్రహ దాత మర్రి జలంధర్ రెడ్డి – లక్ష్మి, అన్న ప్రసాద దాత సంత ప్రతాప్ రెడ్డి – గంగజల, అమ్మవారి పుస్తెలు మర్రి ఓదెలు – హేమలత, అమ్మవారి చీరలు సామ మైపాల్- జలజ, అమ్మవారి పూల అలంకరణ నరసింహారెడ్డి- సత్య, అమ్మవారి ఖడ్గం పైడిపల్లి సంతోష్ రావు – నర్మద, అమ్మవారి వెండి కంకణాలు ముల్క మల్లయ్య- శ్రీమన్, అమ్మవారి ముక్కుపుడక ముల్క శ్రీకాంత్ – తేజశ్రీ, అమ్మవారి పూజ సామాగ్రి సొంత జలంధర్ రెడ్డి – లక్ష్మి, అమ్మవారి వెండి త్రిశూలం సామ మోహన్ రెడ్డి – లావణ్య, అమ్మవారి బొట్టు బిల్లా సంధి రెడ్డి సుశ్విత రెడ్డి – సాత్విక్ రెడ్డి, అమ్మవారి వెండి చక్రం సంత ప్రణయ్ రెడ్డి – శృతి, అమ్మవారి గాజుల అలంకరణ సంత ప్రకాష్ రెడ్డి – వనజ మమత, అమ్మవారి వెండి నామాలు కొమ్ముల కమలాకర్ రెడ్డి – రమ దాతలు అమ్మవారికి సమర్పించారు. తదుపరి భవానీలు మాలలు ధరించారు. దేవిని బాలా త్రిపుర సుందరి అవతారంలో అలంకరణ పూర్తి చేశారు. ఇట్టి వేడుకలలో ఊరి గ్రామ ప్రజలు హాజరయ్యారు.
