Eleti Maheshwar Reddy birthday celebrations Nirmal: బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్మల్ నియోజకవర్గంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. నిర్మల్ నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం మహేశ్వర్ రెడ్డి నివాసంలో కుటుంబ సమేతంగా, నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో వేడుకలు జరుపుకున్నారు. మండల కేంద్రాల్లో బీజేపీ నాయకులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో ఉండాలని ఆలయాల్లో పూజలు నిర్వహించారు, ఆసుపత్రులలో, వృద్ధాశ్రమంలో పండ్లు, అన్నదానం చేశారు. పట్టణంతో పాటు పలు మండల కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించారు.
కదిలి పాపహరేశ్వర ఆలయంలో పూజలు
బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి జన్మదిన సందర్భంగా దిలావార్‌పూర్ మండలం కదిలి గ్రామంలోని పాపహరేశ్వరాలయంలో మహేశ్వర్ రెడ్డి దంపతులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే దంపతులను శాలువాతో సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
నిర్మల్లో ఆలయాల సందర్శన
ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని అదే రోజు దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడంతో ఎమ్మెల్యే దంపతులు పట్టణంలోని పలు అమ్మవారి ఆలయాలను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్మల్ పట్టణంలోని బంగల్‌పేట్ శ్రీ మహాలక్ష్మి ఆలయంలో ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రముఖుల శుభాకాంక్షలు
బీజేఎల్పీ నేత నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని పలువురు ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. నిర్మల్ జిల్లాలోని వివిధ మండలాలకు అధికారులు, బీజేపీ నాయకులు, అనుచరులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నివాసానికి తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపారు. మహేశ్వర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పట్టణమంతా అభిమానులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.