Foundation stone of Markandeya temple construction: ఇబ్రహీంపట్నం, నవంబర్ 20 (మన బలగం): జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి దేవాలయం పునర్నిర్మాణ పనులను బుధవారం శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య శ్రీ విద్యారణ్య భారతి స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. పద్మశాలి పట్టణ అధ్యక్షులు ధ్యావనపల్లి రాజారాం దంపతులు, పురోహితులు ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హిందూ ధర్మాన్ని పాటిస్తూ పిల్లలను భక్తిభావంతో పెంచాలని సూచించారు. ప్రతి ఒక్కరూ సనాతన ధర్మం పాటించాలని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, పద్మశాలి పట్టణ అధ్యక్షులు ధ్యావనపెల్లి రాజారాం, ఉపాధ్యక్షులు సంకు ఆనంద్, అన్నం నాగరాజు, గుంటుక గౌతమ్, ప్రధాన కార్యదర్శి భీమనాతి సత్యనారాయణ, కోశాధికారి భాస్కర్, పట్టణ 20 వార్డుల పద్మశాలి సంఘాల అధ్యక్ష కార్యవర్గ సభ్యులు పద్మశాలి కుల బాంధవులు పాల్గొన్నారు.