Gazetted Officers: నిర్మల్, నవంబర్ 29 (మన బలగం): జిల్లా అభివృద్ధికి గెజిటెడ్ అధికారుల సహకారం ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. నూతనంగా ఏకగ్రీవం ఎన్నికైన నిర్మల్ జిల్లా కార్యవర్గాన్ని కలెక్టర్ అభినందించారు. నూతనంగా ఎన్నికైన తెలంగాణ గజిటెడ్ అధికారుల సంఘం నేతలు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డాక్టర్ పీజీ రెడ్డి, డి.రమేశ్ నేతృత్వంలో కలెక్టర్‌ను ఛాంబర్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. కలెక్టర్‌కు మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి గెజిటెడ్ అధికారుల సహకారం ఎంతో అవసరమని, రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు, రాష్ట్రంలోనే జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని కోరారు. టీజీవోల భవనానికి స్థలం కేటాయించాలని టీజీవో నాయకులు విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. గజిటెడ్ అధికారుల సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లవేళలా కృషి చేస్తానని కలెక్టర్ హామీని ఇచ్చారు. అనంతరం సంఘ సభ్యులను అధ్యక్షులు డాక్టర్ పీజీ రెడ్డి కలెక్టర్‌కు పరిచయం చేశారు. అదనపు కలెక్టర్‌లు ఫైజాన్ అహ్మద్, అశోక్ కుమార్‌లను సైతం టీజీవో నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో టీజీవో అధ్యక్షులు డాక్టర్ పీజీ రెడ్డి, జిల్లా కార్యదర్శి డి.రమేశ్, అసోసియేట్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్, రవికుమార్, గోదావరి, శ్రీనివాస్ గౌడ్, శంకర్, రాజమల్లు, డాక్టర్ రాణి, వినోద్ కుమార్, కరుణశ్రీ పాల్గొన్నారు.