Kaka Venkataswamy Vardhanti: పెద్దపెల్లి, డిసెంబర్ 22 (మన బలగం): కాకా వెంకటస్వామి వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించేందుకు నిర్వహించిన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్‌కుమార్ వెంకటస్వామి సేవలను స్మరించుకుంటూ, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఆయన చేసిన అమూల్యమైన కృషిని గుర్తుచేశారు. వెంకటస్వామి జీవన విధానం, ప్రజాసేవ పట్ల ఆయన ఉన్న నిబద్ధత అందరికీ ప్రేరణగా నిలుస్తుందని వారందరూ అన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ తదితర ముఖ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన చేసిన సేవలు, ప్రజల కోసం జరిపిన త్యాగాలు తరతరాలకు మార్గదర్శకంగా ఉంటాయని అందరూ అభిప్రాయపడ్డారు.