Dharmapuri: ధర్మపురి, నవంబర్ 30 (మన బలగం): ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సమీపంలోని గోదావరికి శనివారం మహా హారతి నిర్వహించనున్నారు. కార్యక్రమ ఏర్పాట్లను శుక్రవారం నిర్వాహకులు పరిశీలించారు. హారతి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎతిషే శ్వరా నంద స్వామిజీ, గోదావరి మహా హారతి వ్యవస్థాపక అధ్యక్షులు పొల్సాని మురళిధర్ రావు హాజరవుతున్నట్లు రాష్ట్ర కో కన్వీనర్ దామెర రాంసుధాకర్ రావు తెలిపారు. హారతి కార్యక్రమానికి వేలాదిగా హిందూ బంధువులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ పిల్లి శ్రీనివాస్, బండారి లక్ష్మణ్, బెజ్జర లవన్, గాజు భాస్కర్, సంగి శేఖర్, కందల నరసింహ మూర్తి, సురేంద్ర మోహన్, శివ లింగం, లక్ష్మీనారాయణ గౌడ్ పాల్గొన్నారు.