ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేసిన నాయకులు
NTR vardhanti: ఎల్లారెడ్డిపేట, జనవరి 18 (మన బలగం): దివంగత ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి శనివారం ఎల్లారెడ్డిపేట మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ఆనాడు ఎన్టీఆర్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాడని కొనియాడారు. ఎన్టీఆర్ అడుగు జాడల్లో ప్రతి కార్యకర్త నడవాలని సూచించారు. కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా ఇన్‌చార్జి ఆకునూరి దయాకర్ రావు, రాష్ట్ర నాయకులు మాలోతు సూర్యనాయక్, తీగల శేఖర్ గౌడ్, మండల నాయకులు చిట్కూరి నారాయణ గౌడ్, శనిగరం బాలరాజు, రంగారావు, లింగాల దాసు, మల్లారెడ్డి, చంద్రారెడ్డి, ప్రహ్లాద్, రాములు నాయక్, లష్మిరాజం, ప్రభాకర్, బింగి వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.