Chada Venkata Reddy: కరీంనగర్, జనవరి 18 (మన బలగం): అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఏఐటీయూసీ జిల్లా ప్రజాసంఘాల జనరల్ బాడీ సమావేశం బద్ధం ఎల్లారెడ్డి భవన్ గణేశ్ నగర్ కరీంనగర్‌లో కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్ అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథులుగా సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట రెడ్డి హాజరై మాట్లాడుతూ దేశంలోని అసంఘటితరంగా కార్మికుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అందే విధంగా చూడాలని కోరారు. కార్మికులు పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాలురాస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అంగన్వాడి, మధ్యాహ్నం, భోజనం, ఏఎన్ఎం, ఔట్‌సోర్సింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని రంగాల కార్మికులను ఐక్యం చేసి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య జిల్లా ఆఫీస్ బేరర్స్, కార్యవర్గం కాసెట్టి లక్ష్మయ్య, పిట్టల సమ్మయ్య, పిట్టల శ్రీనివాస్, డి.రజిత, ఏ.రజిత, సాయిలు, రజిత, అంజయ్య, రాజయ్య, కొమురయ్య, నరసయ్య, శ్రీనివాస్, భాగవతం వీరయ్య, పోశయ్య, ఉమా శంకర్, మామిడి శెట్టి శంకరయ్య, ఐలయ్య, లింగయ్య బాలయ్య, అన్ని ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
