Medical student Teja
Medical student Teja

Medical student: నిర్మల్ వైద్య విద్యార్థికి అరుదైన గౌరవం

Medical student: నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన శ్రీరాముల శ్రీనివాస్ కుమారుడు శ్రీరాముల తేజకు అరుదైన గౌరవం లభించింది. శనివారం హైదరాబాద్‌లోని గాంధీ వైద్య కళాశాలలో 70వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అదే కళాశాలలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న శ్రీరాముల తేజ ప్రొఫెసర్ డాక్టర్ రాజారెడ్డి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్నారు. అనంతరం నిర్మల్ పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు గాంధీ వైద్య కళాశాల పూర్వ విద్యార్థి డాక్టర్ దామెర రాములు సాహితీ రంగంలో చేస్తున్న సేవలను గుర్తించి ఆయనకు ఈ సందర్భంగా గౌరవ పురస్కారం అందజేశారు. నిర్మల్ వైద్యులు పురస్కారాలు అందుకోవడం పట్ల పలువురు ప్రముఖులు, చిన్ననాటి మిత్రులు అభినందనలు వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిర, కళాశాల ప్రొఫెసర్స్, అధ్యాపకులు, ఐఏఎస్‌లు, ఐఆర్ఎస్ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *