ACB arrested SI: తెలంగాణ బ్యూరో/ మన బలగం: కామారెడ్డి జిల్లా లింగంపేట పోలీసు స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న కంది సుధాకర్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. ఒక కేసులో నిందితుడిగా చేర్చకుండా ఉండేందుకు ఎస్సై లంచం డిమాండ్ చేశాడు. రూ.12500 ఎస్సైకి ఇస్తుండగా బుధవారం ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ద్విచక్రవాహనాలు అమ్మకాలు, కొనుగోలు చేసే వ్యక్తి నుంచి లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హనుమాన్ జంక్షన్ వద్ద రూ.12,500 లంచం తీసుకుంటూ ఎస్సై సుధాకర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. నెల రోజుల వ్యవధిలోనే ఈ పోలీసు స్టేషన్‌లో రెండో కేసు నమోదు కావడం కలకం సృష్టిస్తోంది. డిసెంబర్ మొదటి వారంలో అప్పటి ఎస్సై అరుణ్ కుమార్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు.