ACB raid: తెలంగాణ బ్యూరో / మన బలగం: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని శ్యాంపూర్ పశువైద్యశాల అసిస్టెంట్ సివిల్ సర్జన్ డాక్టర్ రాథోడ్ రమేశ్ లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీకి పట్టుబడ్డాడు. ఇదే వైద్యశాలలో ఆయనతోపాటు పనిచేసిన ఉద్యోగి బదిలీపై నార్నూర్ మండలానికి వెళ్లాడు. కాగా రెండు నెలలకు సంబంధించిన డ్యూటీ సర్టిఫికెట్ ఇచ్చేందుకు రూ.30 వేలు డిమాండ్ చేశాడు. రూ.15 వేలు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. లంచం ఇస్తేనే సర్టిఫికెట్ ఇస్తానని చెప్పడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. రూ.15 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.