- జిల్లాలో విజృంభిస్తున్న విషజ్వరాలు
- వరుస మరణాలపై ప్రభుత్వానికి కనీసం పట్టింపు లేదు
- అల్లీపూర్‌లో చిన్నారి మరణం కలచివేసింది
Jagityala Brs: ధర్మపురి, అక్టోబర్ 1 (మన బలగం): జగిత్యాల జిల్లాలో శానిటేషన్ నిర్లక్ష్యంతో విజృంభిస్తున్న విషజ్వరాలతో ప్రజలు మరణిస్తున్నా ప్రభుత్వానికి పట్టడంలేదని జగిత్యాల జిల్లా పరిషత్ తొలి చైర్‌పర్సన్ దావ వసంత సురేశ్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తొమ్మిది నెలలు పూర్తయినా ప్రభుత్వ పాలన మెరుగు పడలేదన్నారు. రాయికల్ మండలం అల్లీపూర్‌లో 11 ఏళ్ల చిన్నారి జ్వరంతో బాధ పడుతూ చనిపోయిన ఘటన కలిచివేసిందన్నారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా విషజ్వరాలు ప్రబలుతున్నా, ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం, అధికారులకు పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డెంగ్యూ పాజిటివ్‌లు వచ్చిన వైద్యులు కనీసం అందుబాటులో ఉండడం లేదన్నారు.
బ్లీచింగ్ పౌడర్‌కు బదులు సున్నం చాలుతూ మమా అనిపించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఓట్లేసి గెలిపించిన పాపానికి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో సీజనల్ వ్యాధులపై విస్తృతంగా శానిటేషన్ ప్రక్రియను వేగవంతం చేశారని గుర్తుచేశారు. వానకాలం సీజన్ ముగిసినా రైతు భరోసా అందలేదన్నారు. పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదని తెలిపారు. విత్తనం పెట్టి చేతికి వచ్చే టైం వచ్చినా కనీస సౌకర్యాలు అందడం లేదని చెప్పారు. ఇచ్చినా హామీలు అమలు చేయడంలో విఫలం అయ్యారని తెలిపారు. ఇంట్లో పెద్ద కొడుకు లాగా కేసీఆర్ ఆదుకున్నారని వివరించారు. వ్యక్తిగతం తప్ప, ప్రజా శ్రేయస్సు కాంక్షించిన పథకం ఎక్కడా అమలు కాలేదని తెలిపారు. మహాలక్ష్మి, విద్యా భరోసా, ఫీజు రియీంబర్స్‌మెంట్ విడుదల కాలేదని చెప్పారు. ఆరు గ్యారంటీలు ఒక్కటి అమలు కాలేదని మండిపడ్డారు. పల్లెల దుస్థితిపై సమీక్ష నిర్వహించాలని పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్కను కోరారు.
పథకాలు అమలు చేయకున్నా ప్రాణాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. శానిటేషన్ నిర్వహించాలన్నారు. అధికారులు ప్రజలకు సేవకులుగా ఉంటూ సమస్యలు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో జగిత్యాల పట్టణ అధ్యక్షుడు గట్టు సతీశ్, అర్బన్ మండల అధ్యక్షుడు తుమ్మ గంగాధర్, మాజీ జెడ్పీటీసీ మహేశ్, పట్టణ ప్రధానకార్యదర్శి ఆనంద్ రావు, ఉపాధ్యక్షులు వొల్లెం మల్లేశం, ఏఎంసీ మాజీ చైర్మన్ శీలం ప్రియాంక ప్రవీణ్, రూరల్ మండల సమన్వయ కమిటీ సభ్యులు పడిగెల గంగారెడ్డి, ఆనంద్ రావు, కౌన్సిలర్లు సమీండ్ల వాణి శ్రీనివాస్, శ్రీధర్ రెడ్డి, మహేశ్ గౌడ్, అర్బన్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు సంగేపు ముత్తు, అర్బన్ మండల యూత్ అధ్యక్షుడు సన్హిత్ రావు, రూరల్ మండల యూత్ అధ్యక్షుడు సదానందం, ప్రధాన కార్యదర్శి బాలె చందు, పట్టణ యూత్ ఉపాధ్యక్షుడు ప్రణయ్, సెక్రటరీ నీలి ప్రతాప్, భగవాన్ రాజ్, రాయికల్ పట్టణ అధ్యక్షుడు అనిల్, మండల మహిళా అధ్యక్షురాలు స్పందన, రాయికల్ మండల సమన్వయ కమిటీ సభ్యులు బర్కం మల్లేశ్, కొల్లూరి వేణు, దొంతి నాగరాజు పాల్గొన్నారు.