CM Cup: ముధోల్, డిసెంబర్ 11 (మన బలగం): విద్యార్థులు క్రీడలతోపాటు చదువులో రాణించాలని తహసీల్దార్ శ్రీకాంత్ అన్నారు. మండల కేంద్రమైన ముధోల్‌లోని జడ్పీహెచ్ఎస్ మైదానంలో బుధవారం సీఎం కప్ క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. విద్యార్థులు చదువులతోపాటు క్రీడలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రెండు రోజులుగా నిర్వహించిన సీఎం క్రీడా పోటీల్లో కబడ్డీ బాలుర మొదటి బహుమతి తరోడతాండా,రెండో బహుమతి విట్టోలి తండా, కబడ్డీ బాలికల మొదటి బహుమతి అష్ట, రెండో బహుమతి ముధోల్, వాలీబాల్ ఫస్ట్ బహుమతి ఎడ్‌బిడ్, రెండో బహుమతి ముధోల్, వాలీబాల్ బాలికల ఫస్ట్ బహుమతి విట్టోలి తండా, సెకండ్ బహుమతి ముధోల్, ఖోఖో ఫస్ట్ బహుమతి అష్ట, రెండో బహుమతి ఎడ్‌బీడ్ తండా, ఖోఖో బాలికల ఫస్ట్ బహుమతి అష్ట, సెకండ్ బహుమతి ఎడ్‌బిడ్ జట్టు గెలుపొందాయ. కార్యక్రమంలో ఎంపీడీవో శివకుమార్, మండల విద్యాధికారి రమణారెడ్డి, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ రత్నాకర్, పీడీ శ్రీనివాస్ తదితరులున్నారు.