LRS applications: నిర్మల్, అక్టోబర్ 17 (మన బలగం): ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలక్టరేట్ సమావేశ మందిరంలో ఎల్ఆర్ఎస్ పై సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఇప్పటి వరకు పరిష్కరించిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు, మండలాల వారీగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేసేందుకు వీలుగా ఎక్కువ లాగిన్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. రెవెన్యూ, మున్సిపల్, నీటిపారుదల శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించాలని ఆదేశించారు. అధికారుల బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి దరఖాస్తుల పరిశీలన పారదర్శకంగా చేపట్టాలని సూచించారు. ఎప్పటికప్పుడు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనకు సంబంధించి వివరాలను నమోదు చేసి, అధికారులకు అందజేయాలని ఆదేశించారు.ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డీఆర్ఓ భుజంగ్ రావ్, నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్లు రాజు, రాజేష్ కుమార్, మనోహర్ లు డీపీఓ శ్రీనివాస్, రెవెన్యూ, ఇరిగేషన్, పట్టణ ప్రణాళిక అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.