BJP MLA Eleti Maheshwar Reddy: నిర్మల్, ఆగస్టు 18 (మన బలగం): నిర్మల్ పట్టణంలోని సిద్ధాపూర్ – కౌట్ల (కె) గ్రామాల మధ్య గల బ్రిడ్జిని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు. స్వర్ణ ప్రాజెక్ట్ వరద నీటి ఉధృతి ద్వారా బ్రిడ్జి కొంత మేర పగుళ్లు ఏర్పడిందని అన్నారు. పురాతన బ్రిడ్జి స్థానంలో కొత్త బ్రిడ్జి ఏర్పాటు చేసే విధంగా నివేదిక రూపొందించి పంపాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పట్టణ మండల బీజేపీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.