Release the water: నిర్మల్, డిసెంబర్ 25 (మన బలగం): సొన్ మండలం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సరస్వతి కెనాల్ ద్వారా ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి బుధవారం నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సరస్వతి కెనాల్ ఆయకట్టు రైతుల పంటల సాగు కోసం నీటిని దిగువకు విడుదల చేసినట్లు తెలిపారు. రైతుల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు, మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే
నిర్మల్ పట్టణంలోని వెంకటాపూర్ నుంచి నిస్సి చర్చ్ వరకు రూ.కోటి 60 లక్షలతో నిర్మించిన రోడ్డును ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు అధికారులు పాల్గొన్నారు.
