cage culture units: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 10 (మన బలగం): జిల్లాలోని మధ్య మానేర్ రిజర్వాయర్ జలాశయ పరిధిలో గల చీరవంచలో ఫిషిన్ ఫార్మ్ ఇండియా వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేజ్ కల్చర్ యూనిట్లను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గురువారం తనిఖీ చేశారు. రిజర్వాయర్‌లో వృత్తాకార, పది 10 మీటర్ల డయా సర్క్యులర్ బోనులు, ఎనిమిది 5×5 మీటర్ల సైజు గల కేజ్ కల్చర్‌ను యూనిట్లను ఏర్పాటు చేసి, దానిలో దాదాపు 4.2 లక్షల విత్తనాలను నిల్వ చేశారు. ప్రస్తుత మీడ్ మానేర్ రిజర్వాయర్ నీటి మట్టం తగ్గుముఖం పడుతుందని, ఎక్కువ పంజారాలను ఏర్పాటు చేయలేకపోతున్నామని, ప్రస్తుత నీటి మట్టం 8 టిఎంసిలు మాత్రమే ఉన్నందున వేసవి కాలం, పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా మరిన్ని హెచ్చుతగ్గులు సంభవించే అవకాశం ఉన్నదని, ఫిషిన్ ఫాం ప్రైవేట్ లిమిటెడ్ వారు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. మిడ్ మానేర్ రిజర్వాయర్ లో నీరు ఎక్కువ కాలం, అధిక లోతు ఉండి ఇతర జలచరాల భద్రతకు భంగం కాకుండా ఉండే అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకొని కేజ్ కల్చర్ యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా ఫిషరీస్ అధికారి సౌజన్య తదితరులు పాల్గొన్నారు.