Whip Adi Srinivas: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 10 (మన బలగం): సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని అపెరల్ పార్క్‌లో పంక్చుయేట్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ (టెక్స్ పోర్ట్) యూనిట్‌ను శుక్రవారం రాష్ట్ర జిల్లా ఇన్చార్జి మంత్రి పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లాకు రానున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం అపెరల్ పార్క్‌ను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బీ గితె, అధికారులతో కలిసి మంత్రుల పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం విప్ మాట్లాడారు. మంత్రులు పంక్చుయేట్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్( టెక్స్ పోర్ట్)ను ప్రారంభించి, పరిశ్రమను పరిశీలిస్తారని వివరించారు. అనంతరం యూనిట్‌లోని కార్మికులు, ఉద్యోగులతో ముఖా ముఖి ఉంటుందని, భోజనం చేసి, తిరుగు ప్రయాణం అవుతారని తెలిపారు. మంత్రుల రాక సందర్భంగా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఏర్పాట్ల పరిశీలనలో సిరిసిల్ల ఆర్డీవో రాధాబాయి, వేములవాడ ఏఎస్‌పి శేషాద్రిని రెడ్డి, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.