Srinivasa Ramanujan Jayanti: మనబలగం, సిద్దిపేట ప్రతినిధి: సిద్దిపేట జిల్లా దూలిమిట్ట ఉన్నత పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవం, గణిత పితామహుడు శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలలో గణిత సబ్జెక్టు సంబంధించి తెలియజేసే వివిధ నమూనాలతో ఏర్పాటు చేసిన గణిత గ్రంథాలయాన్ని మద్దూరు మండల విద్యాధికారి వరదరాజులు, చేర్యాల మండల విద్యాధికారి కిష్టయ్యతో కలిసి పాఠశాల ప్రధానోపాధ్యాయులు కరుణాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ గణిత పరిశోధనల గురించి గణిత శాస్త్రానికి వారి చేసిన సేవల గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులకు గణిత నమూనాలతో కూడిన ముగ్గుల పోటీలు, క్విజ్ పోటీలు, గణిత ఉపన్యాస పోటీలు, గణిత పాటల పోటీలు నిర్వహించారు. తదనంతరం విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మద్దూరు మండల విద్యాధికారి వరదరాజులు, చేర్యాల మండల విద్యాధికారి కిష్టయ్య, ఆకునూరు హైస్కూల్ హెడ్మాస్టర్ ఐలయ్య, జాలపల్లి పాఠశాల హెడ్మాస్టర్ హేమచందర్, రిటైర్డ్ ఉపాధ్యాయులు లక్ష్మారెడ్డి, గణిత ఉపాధ్యాయులు చిలుక వెంకటయ్య, కాంపెల్లి సమత, నిమ్మ సురేందర్ రెడ్డితో పాటు ఉపాధ్యాయులు కక్కెర్ల నాగరాజు, మానుక శ్రీనివాస్, వంగ శ్రీనివాస్ రెడ్డి, ఇర్రి రాజిరెడ్డి, నాగులపల్లి రాములు, నిమ్మ సురేందర్ రెడ్డి, వెగ్గలం సతీశ్ కుమార్, సుద్దాల రంజిత్ కుమార్, యామ రాజు ఉపాధ్యాయురాలు సందిటి సులోచన, రికార్డ్ అసిస్టెంట్ మల్లం సత్యనారాయణ, ఆఫీసు సబార్డినెట్ సిరబోయిన రమేష్, ఆయా లక్ష్మీ, ఆయా తరగతుల విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.