Devulapalli Ramesh: సిద్దిపేట, నంగునూర్, డిసెంబర్ 23 (మన బలగం): హైదరాబాద్ సిటీ కల్చరల్ చిక్కడపల్లిలో విమల సాహితీ సమితి, అధ్యక్షులు ప్రముఖ కవి డా.జెల్ది విద్యాధర్ రచించిన ‘కోహినూర్’ పుస్తక ఆవిష్కరణలో నంగునూర్ మండలానికి చెందిన కవి దేవులపల్లి రమేశ్, కవి సమ్మేళనంలో ‘గ్రంథాలయం’ అనే కవిత గానం చేసినందుకు సాహిత్య రంగంలో సేవలు అందించినందుకు గాను, ముఖ్యఅతిథి పద్మశ్రీ కులకలూరి ఇనక్, డా.బిక్కి కృష్ణ, డా.రాధా కుసుమ, మంజుల సూర్య, చేతుల మీదుగా దేవులపల్లి రమేశ్‌ను అభినందిస్తూ ఘనంగా సన్మానించారు. కవి రమేశ్ మాట్లాడుతూ తెలుగు సాహిత్య చరిత్ర, తెలుగు భాష గొప్ప తనం మన తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో రచయిత్రి శైలజ మిత్ర, రోహిణి వంజరి, నాళేశ్వర శంకరం, శిఖా మణి, వివిధ జిల్లా నుంచి కవులు, కళాకారులు రచయితలు తదితరులు పాల్గొన్నారు.