Christmas celebrations: నిర్మల్, డిసెంబర్ 25 (మన బలగం): నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, క్రైస్తవ సోదర సోదరీమణులకు ఎమ్మెల్యే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, తదితరులు పాల్గొన్నారు.