National Child Welfare Programme: ఎల్లారెడ్డిపేట, డిసెంబర్ 23 (మన బలగం): విద్యార్థులు పరిపూర్ణ ఆరోగ్యాంగా ఉంటేనే చదువుపై శ్రద్ధ వహించగలరని డాక్టర్ సాయి చంద్ర, డాక్టర్ సంధ్యారాణి సూచించారు. ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం రాష్ట్రీయ బాల స్వస్తీయ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉంటే చదువుపై ఏకాగ్రత ఉంటుందని అన్నారు. బయట తిండి కన్నా ఇంట్లోనే పరిశుభ్రమైన పౌష్టికాహారం తయారు చేసుకోవచ్చని, అందుకే ప్రతి ఒక్కరూ మంచి ఆరోగ్యానికి మంచి తిండి తినాలని సూచించారు. అనంతరం పలువురు విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు తగు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ వసరవేణి పర్శరాములు, అధ్యాపకులు భూమక్క, గీత, గౌతమి, ప్రవళిక, సాగర్, అంజలి, ఫార్మాసిస్టు అంజలి, ఆశ వర్కర్లు కవిత, లతా, గౌరి పాల్గొన్నారు.