Nirmal Festivals: నిర్మల్, జనవరి 7 (మన బలగం): రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉందని, నిర్మల్ గతం ఎంతో ఘనమైనదని మాజీ మత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో మంగళవారం ఆయన పాల్గొన్నారు. ముందు తరాలకు నిర్మల్ చరిత్రను అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో ఉత్సవాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ జాయింట్ కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.