Maha Kumbha Mela: మహా కుంభమేళాకు మరి కొద్ది రోజులే ఉంది. యూపీలోని ప్రయాగ్రాజ్‌లో ప్రతి 12 ఏండ్లకోసారి కుంభమేళా నిర్వహిస్తారు. వచ్చే ఏడాది (2025) జనవరి 13(పుష్యపూర్ణిమ) నుంచి ఫిబ్రవరి 26(శివరాత్రి) వరకు ఉత్సవాలు వైభవోపేతంగా కొనసాగనున్నాయి. లక్షలాది భక్తులకు కుంభమేళాకు హాజరు కానున్నారు. హరిద్వార్, నాసిక్, ఉజ్జయినిలోనూ కుంభమేళాకు ఏర్పాట్లు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాలతోపాటు విదేశాల నుంచి లక్షాలాదిగా భక్తులు తరలిరానున్నారు. ప్రజలతోపాటు సాధువులు, అఘోరాలు పుణ్యస్నానాలు ఆచరించనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలంగాణ / ఆరాధన / తాజా వార్తలు