చెస్ పోటీలో అవార్డు పొందిన శ్రీహన్ రామ్ మంత్రరాజం
Srihan Ram chess winner: నిర్మల్, నవంబర్ 4 (మన బలగం): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణకు చెందిన మంత్రరాజం శ్రీహన్ రామ్ చెస్ పోటీలో అవార్డు పొంది తెలంగాణ రత్నంగా వెలుగొందారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణం శివాజీ నగర్‌కు చెందిన మంత్రరాజం అజయ్ కృష్ణ ఫిజియోచీఫ్ సతీమణి కుమారం దివ్యశ్రీ ఫిజియోథెరపీ కొన్ని ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో రియోవెల్ ఫిజియోథెరపీ రీహాబిటేషన్‌లో పనిచేస్తున్నారు. వారి కుమారుడు శ్రీహన్ రామ్ మంత్రరాజం సిల్వర్ హోక్స్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం స్కూల్‌లో సెకండ్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నాడు. అయితే కేకేఆర్ చెస్ అకాడమీ నిర్వహించిన చెస్ పోటీల్లో 36 మంది పాల్గొన్నారు. ఇందులో అండర్ సెవెన్‌లో మంత్ర రాజం శ్రీహన్ రామ్ ప్రథమ బహుమతితో పాటు ప్రశంసాపత్రం అవార్డును టోర్నమెంట్ డైరెక్టర్ కే చేతన్ కుమార్ నిర్వాహకుల చేతుల మీదుగా అందుకున్నారు. ఆంధ్రరాష్ట్రంలో తెలంగాణకు చెందిన బాల విద్యార్థి ప్రతిభ సాధించడంపై వారి తాత సీనియర్ జర్నలిస్టు మంత్రరాజం దేవేందర్ అన్నపూర్ణతో పాటు నిర్మల్ జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆటపాటల పోటీలో కాకుండా మేధాశక్తికి సంబంధించిన చెస్ (చదరంగం) పోటీలో రాణించడం గమనార్హం. ఖానాపూర్ శివాజీ నగర్ ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేశారు.