Helicopter survey: జగిత్యాల ప్రతినిధి, ఫిబ్రవరి 8 (మన బలగం): జగిత్యాల పట్టణ పరిధిలో శనివారం ఉదయం నుంచి గాల్లో హెలికాప్టర్ చక్కర్లు కొడుతోంది. ఉదయం నుంచి అనేక దఫాలుగా పట్టణం చుట్టూ హెలికాప్టర్ భారీ శబ్దంతో చక్కర్లు కొట్టడంతో స్థానికంగా చర్చనీయంశంగా మారింది. ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా ఉండేందుకు, ప్రభుత్వ భవనాల గుర్తింపు, భూముల వివరాల నమోదుకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రాజెక్టును చేపట్టినట్లు తెలిసింది. అందులో భాగంగా రాష్ట్రంలోని 20 మున్సిపాలిటీలను పైలెట్ ప్రాజెక్టు క్రింద ఎంపిక చేయగా అందులో జగిత్యాల ఒకటిగా ఎంపికైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అధికారులు హెలికాప్టర్ ద్వారా సర్వే చేసి నక్షా తయారు చేసి సరిహద్దులను నిర్ణయాయించనున్నట్లు తెలిసింది. రెండు రోజులపాటు జరిగే ఈ హెలికాప్టర్ సర్వే కోసం కలెక్టరేట్ ఎదురుగా ఉన్న హెలిప్యాడ్ ద్వారా అధికారుల సర్వేకు ఏర్పాట్లు చేశారు.
