Gun Park Telangana Martyrs tribute rice distribution: నిర్మల్ జిల్లా జనసమితి అధ్యక్షులు కడపత్రి తిలక్ రావ్ హైదరాబాద్‌లో పితృ అమావాస్య సందర్భంగా శనివారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్దలకు బియ్యం ఇచ్చే కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని గన్ పార్క్ వద్ద తెలంగాణ కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరులకు తెలంగాణ జన సమితి పార్టీ ఆధ్వర్యంలో బియ్యం ఇచ్చే కార్యక్రమంలో జనసమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాంతో కలిసి నిర్మల్ జిల్లా తరఫున నివాళులు అర్పించారు. తెలంగాణ సాధన కోసం ఎందరో మంది తమ ప్రాణాలను త్యాగం చేసారని, ఆ వీరులను స్మరించుకోవటం అందరి భాద్యత అని అన్నారు. కార్యక్రమంలో నిర్మల్ జిల్లాకు చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.