Awareness on CC cameras: నిర్మల్, అక్టోబర్ 23 (మన బలగం): ఆలయాల్లో దొంగతనాల నివారణకు గ్రామ అభివృద్ధి కమిటీలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని భైంసా రూరల్ సీఐ నైలు సూచించారు. బుధవారం రూరల్ పోలీస్ స్టేషన్‌లో గ్రామ అభివృద్ధి కమిటీలతో సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంగా మాట్లాడారు. శాంతి భద్రతల పరిరక్షణకు గ్రామల వారీగా సెక్టార్‌లను ఏర్పాటు చేసి పోలీస్ అధికారులకు ఇన్‌చార్జి బాధ్యతలు ఇవ్వనున్నట్లు తెలిపారు. సమస్యలు ఉంటే సంబంధిత ఇన్‌చార్జులను సంప్రదించాలన్నారు. అదే విధంగా గ్రామ పెద్దల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. పేకాట, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే, గంజాయి అమ్మితే చట్ట పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో రూరల్ ఏఎస్ఐ మారుతి, ఆయా గ్రామాల అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.