Collector Sandeep Kumar Jha: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 5 (మన బలగం): జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా అధ్యక్షతన మాతా శిశు మరణాలపై ఎన్‌డీడీ కార్యక్రమాలపై సమన్వయ కమిటీతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో మాత మరణాలు జరగకుండా మొదటిసారి గర్భం ధరించిన తర్వాత రిజిస్ట్రేషన్ నుంచి గర్భధారణ చెకప్‌లు ఆశాల ద్వారా ఏఎన్ఎం ద్వారా చెకప్‌లు సకాలంలో చేయించాలని సూచించారు. వారికి పౌష్టిక ఆహారం గురించి అవగాహన కల్పించడం ద్వారా, గర్భిణుల ఆరోగ్య సమస్యలు వైద్యాధికారులతో చెకప్‌లు చేయించడం ద్వారా మాత మరణాలు అరికట్టవచ్చని సూచించారు. శిశు మరణాలపై కాన్పు తర్వాత ఆశాలు, ఏఎన్ఎంలు 7 సందర్శనలు చేయడం (48 రోజుల వరకు) ద్వారా మాతా శిశు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు.