నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్
Nirmal Collector: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. సుప్రసిద్ధ భారతీయ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినము పురస్కరించుకొని జాతీయ క్రీడ ఉత్సవాల్లో భాగంగా గురువారం ఎన్టీఆర్ స్టేడియంలో వివిధ క్రీడా పోటీలు నిర్వహించారు. వివిధ క్రీడా పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు సాయంత్రం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బహుమతుల ప్రధానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి తమకు ఇష్టమైన ఆటను ఎంచుకొని అందులో ప్రతిభ చూపాలన్నారు. క్రీడల వలన శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసo కలుగుతుందని తెలిపారు. కోకో, కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్ తదితర క్రీడల్లో విద్యార్థులకు, యువతకు క్రీడల లో శిక్షణ ఇచ్చి రాష్ట్ర, జాతీయస్థాయిలో పాల్గొని జిల్లాకు మంచి పేరు వచ్చే విధంగా ఉపాధ్యాయులు, యువజన క్రీడా శాఖ అధికారులు కృషి చేయాలని సూచించారు. అనంతరం క్రీడాకారులను కలెక్టర్ శాలువాతో సత్కరించి బహుమతులను అందించారు.ఈ కార్యక్రమంలో డివైఎస్ఓ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి, వివిధ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థిని , విద్యార్థులు పాల్గొన్నారు.