Whip Laxman: వర్షాల కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే లక్ష్మణ్ అధికారులకు సూచించారు. పెగడపెల్లి మండలంలోని లింగపూర్, శాలపెల్లి, అడుపపల్లి, రంగదాముని పల్లెలో పర్యటించారు. చెరువు, వాగులను పరిశీలించారు. అధికారులకు తగు సూచనలు చేసి ముందస్తుగా తీసుకుంటున్న చర్యలపైన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ.. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పెగడపెల్లి మండల లింగాపూర్ గ్రామంలోని చెరువు నిండడంతో చెరువును పరిశీలించినట్లు తెలిపారు. శాలపెల్లి నుంచి అడపపెల్లి, రంగధామునిపల్లె గ్రామాల చుట్టూ వరద వచ్చి గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయని తెలిపారు. గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని చెప్పారు. గ్రామస్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.