Excise raids on illicit liquor Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని వీర్నప్లలి మండలంలోని మద్దిమల్ల లొద్ది తండా, భావ సింగ్ తండా గోల్య నాయక్ తండా , బంజరు తండా, భుక్య తం డా రాశిగుట్ట తండాలలో ఎక్సైజ్ అధికారి, సిబ్బంది దాడులు నిర్వహించారు. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 20 లీటర్ల నాటు సారాయి స్వాధీనం చేసుకున్నారు. 250 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఎవరైనా నాటు సారా తయారు చేసినా, రవాణా చేసినా, అమ్మకాలు జరిపినా చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. దాడుల్లో ఎక్సైజ్ సిబ్బంది రాజు, మల్లేష్, వర్మ, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.