- అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
- ఉత్సవాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
Nirmal Festivals: నిర్మల్, జనవరి 8 (మన బలగం): నిర్మల్ జిల్లా చరిత్రను, సాంస్కృతిక వారసత్వాన్ని తెలియజెప్పేందుకు నాలుగు రోజులపాటు నిర్వహించిన నిర్మల్ ఉత్సవాల కార్యక్రమం నేటితో ముగిసింది. నాలుగు రోజుల పాటు ఈ కార్యక్రమానికి వేలాదిగా ప్రజలు హాజరయ్యి ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను, సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. నాల్గవ రోజు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, అధికారులు, ప్రజాప్రతినిధుల, జిల్లా ప్రజల సమన్వయ కృషితోనే నిర్మల్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నామని తెలిపారు. నిర్మల్ జిల్లా చరిత్రను, సాంస్కృతిక వారసత్వాన్ని నేటి తరానికి తెలియజెప్పడానికి నిర్మల్ ఉత్సవాలను నిర్వహించుకోవడం జరిగిందన్నారు. నిర్మల్ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించుటకు కృషి చేసిన జిల్లా అధికారులకు, పలసువురు స్టాళ్ల నిర్వాహకులకు, సాంస్కృతిక కార్యక్రమాలలో పలు పంచుకున్న ప్రతీ ఒక్కరికి ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్తులో ఇటువంటి మరిన్ని విన్నూత్న కార్యక్రమాల నిర్వహణకు సహకారం అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్నకళ్యాణి, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.