Distribution of Cheques: తానూర్, జనవరి 10 (మన బలగం): పేదింటి ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు వరం లాంటివని ముథోల్ శాసనసభ్యులు రామారావు పటేల్ అన్నారు. తానూర్ మండల కేంద్రంలోని రైతు వేదిలో మండలంలోని ఆయా గ్రామాల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ చేశారు. 32 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన లబ్ధదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు. కార్యక్రమంలో తహశీల్దార్, భైంసా ఏఎంసీ చైర్మన్ ఆనంద్ రావు పటేల్, తానూర్ పీఏసీఎస్ చైర్మన్ నారాయణరావు పటేల్, మండల అధ్యక్షులు లక్ష్మారెడ్డి, మాజీ అధ్యక్షులు, సీనియర్ జర్నలిస్టు చిన్నారెడ్డి, బెల్తరోడ సర్పంచ్ సాయినాథ్, సీనియర్ నాయకులు శివాజీ పటేల్, కైలాష్, శేషరావ్, మారుతి, సోమ్‌నాథ్, దేవిదాస్ ఎల్లప్ప, ఆయా గ్రామాల తాజా మాజీ, ప్రజా ప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసిలు, మండల నాయకులు, కార్యకర్తలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.