- సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా డీఎస్సీ నియామకాలు
- ఈ నెల 9న జగిత్యాలలో నిరసన ర్యాలీ
- ఎమ్మార్పీఎస్ నాయకులు
MRPS: జగిత్యాల, అక్టోబర్ 7 (మన బలగం): మాదిగల వ్యతిరేకిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడని, సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్ధంగా ఇటీవలి డీఎస్సీ నియామకాలు చేపట్టారని, దీనిపై ఈ నెల 9న జగిత్యాలలో నిరసన ర్యాలీ చేపడుతున్నామని ఎమ్మార్పీఎస్ నాయకులు ప్రకటించారు. సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంగా ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ అధ్యక్షుడు నక్క సతీశ్ ఆధ్వర్యంలో ఎంఎస్పీ ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు దుమల గంగారాం, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు సురుగు శ్రీనివాస్, అధికార ప్రతినిధి బెజ్జంకి సతీశ్ హాజరై మాట్లాడారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాదిగలను మోసం చేసిందని, మాదిగల ద్రోహి అని, మాటల్లో ఉన్న నీతి చేతల్లో లేదని, కాంగ్రెస్ సర్కార్‌కు నిరసన సెగ తప్పదని హెచ్చరించారు.
ఈనెల 9న జగిత్యాల జిల్లా కేంద్రంగా డీఎస్సీ నియామకాలకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ ఉంటుందని, ర్యాలీకి ప్రస్తుతం డీఎస్సీ రాసిన మాదిగ విద్యార్థులు, మాదిగ మేధావులు, ఉద్యోగస్తులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బోనగిరి కిషన్, ప్రచార కార్యదర్శి కొల్లూరి సురేందర్, ధర్మపురి నియోజకవర్గ అధ్యక్షులు చిర్ర లక్ష్మణ్, తేజ జగిత్యాల నియోజకవర్గ కో-కన్వీనర్ పోడేటి సునీల్, సంగేపు మత్తు, ముప్పట్ల శేఖర్, రాకేశ్ తదితరులు ఉన్నారు.