NPDCL SE Shalia Naik: ఇబ్రహీంపట్నం, మార్చి 8 (మన బలగం): జిల్లాలో వేసవి కార్యాచరణ ప్రణాళికలో భాగంగా చేపట్టిన విద్యుత్ పనులు వేగవంతం చేశామని ఏప్రిల్ నెలాఖరు వరకు వివిధ మండలాల్లో, పట్టణాల్లో నిర్దేశించుకున్న పనులు పూర్తిచేసి లక్ష్యాలు సాధిస్తామని జగిత్యాల ఎన్పీడీసీఎల్ ఎస్ఈ శాలియా నాయక్ పేర్కొన్నారు. గత రాత్రి మెట్‌పల్లి రూరల్ సెక్షన్ పరిధిలో ఆత్మకూరు, మెట్ల చిట్టాపూర్ సబ్‌స్టేషన్లలో అదనపు వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్లు ప్రారంభించారు. తద్వారా సుమారు 1000 మంది రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయగలమని పేర్కొన్నారు. గతంలో ఒకే బ్రేకప్‌పై రెండు లేక అంతకంటే ఎక్కువ ఫీడర్లు ఉండడం వలన విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయాలు జరిగేవి. కానీ ప్రస్తుతం అన్ని సబ్ స్టేషన్లలో ప్రతి ఫీడర్‌కు ఒక ప్రత్యేక బ్రేకర్ నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. రైతులు తమ పంపుసెట్‌లకు విధిగా కెపాసిటర్లు బిగించుకోవాలని డీఈ గంగారం సూచించారు. విద్యుత్ డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్న దృష్ట్యా, వెల్లుల్ల మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో ఒకే రోజు మూడు 100 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్లు ప్రారంభించి, గ్రామంలో లో ఓల్టేజ్, ఓవర్ లోడ్ సమస్యలను పరిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు అధికారులను సన్మానించారు. కార్యక్రమంలో డీఈలు గంగారం, రవీందర్, ఏడీఈ మనోహర్, ఏఈ అజయ్, సిబ్బంది, వీడీసీ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.