Turmeric farmers: ఇబ్రహీంపట్నం, మార్చి 8 (మన బలగం): పసుపు రైతుల మహా ధర్నా విజయవంతం చేయాలని జగిత్యాల జిల్లా రైతు ఐక్య వేదిక అధ్యక్షుడు నల్ల రమేశ్ రెడ్డి కోరారు. శనివారం ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని ఇందిరమ్మ చౌక్ వద్ద రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రమేశ్ రెడ్డి మాట్లాడుతూ మార్చి 11 మంగళవారం పసుపు పంటకు మద్దతు ధర ఇవ్వాలని మెట్‌పల్లి మార్కెట్ యార్డ్ నుంచి కొత్త బస్టాండ్ వరకు జరిగే పసుపు రైతుల మహా ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. అలాగే పసుపు పంటకు మద్దతు ధర రూ.15 వేలు కల్పించి, ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు. మహాధర్నాకు రైతులు, పార్టీలకు అతీతంగా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవతం చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రైతు ఐక్య వేదిక గౌరవ అధ్యక్షులు పన్నల తిరుపతి రెడ్డి, కోరుట్ల తెలంగాణ జనసమితి ఇన్‌చార్జి కంతి మెహన్ రెడ్డి, సహకారసంఘ చైర్మన్ బద్దం గోపి, మాజీ కో-ఆప్షన్ సభ్యులు ఎలేటి చిన్నరెడ్డి, బద్దం రాజారెడ్డి, తీగల శ్రీధర్ రెడ్డి, అలిశెట్టి మెహన్, రైతులు తదితరులు పాల్గొన్నారు.