- యశోధలో బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ సక్సెస్
- డాక్టర్ బీజే రాజేశ్
Successful brain tumor surgery at Yashoda Hospital by Dr. BJ Rajesh: వ్యాధుల పట్ల ప్రజలకు సరైన అవగాహన ఉన్నప్పుడు ఎటువంటి వ్యాధినైనా వైద్యంతో జయించవచ్చని యశోద ఆస్పత్రి వైద్యులు బీజే రాజేశ్ తెలిపారు. నిర్మల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బ్రెయిన్ ట్యూమర్ బారిన పడినవారు తమ జీవితం ఇక్కడితో అయిపోయిందని చాలా బాధపడేవారని, అలాంటి వారికి అవగాహన కల్పించాలని డాక్టర్ బీజే రాజేశ్ న్యూరో సర్జన్ అన్నారు. నిర్మల్ జిల్లా సోన్ మండలం పాక్‌పట్ల గ్రామానికి చెందిన 50 సంవత్సరాల మహిళ తలలో పెద్ద గడ్డతో తీవ్రమైన నొప్పితో బాధపడుతూ ఉదయం తొమ్మిది గంటల నుంచి దాదాపు మూడు గంటలపాటు ఆమెకు నాలుగు చేతులు, కాళ్ళు అచేతనంగా స్పందించకుండా అయిపోయి. నరాల సమస్యలు, తీవ్ర ఇబ్బందులతో యశోద హాస్పటల్ సికింద్రాబాద్‌కు వచ్చిందని తెలిపారు.
ఈ పరిస్థితుల్లో ఉన్న మహిళకు వెంటనే ఆమెను ఎమ్మారై బ్రెయిన్ చేయగా ఎడము ఫ్రంటల్ ప్రాంతంలో అనూహ్యంగా 6 సెంటీమీటర్ల పరిమాణంలో ఒక పెద్ద యాక్సియల్ మాస్ ఉందని (ఎస్.ఎస్.డి, ఈ.ఎస్.బి ఏం.ఆర్) వైద్య పరీక్షలు నిర్వహించి స్పెక్ట్రోస్కోపీలో ఫలితాలు మెని జియోయాను సూచించాయని అన్నారు. డాక్టర్ రాజేశ్ ఎంఎస్ఎంహెచ్, ట్యూమర్ స్పెషలిస్ట్, యశోద హాస్పిటల్ వైద్య సిబ్బంది వెంటనే సర్జరీ చేసి గడ్డను తొలగించడం జరిగిందని తెలిపారు. మూడు రోజుల్లో సాధారణ స్థితికి తీసుకొచ్చామని తెలిపారు. ఆమెకు హాస్పిటల్ నుంచి డిశ్చార్జి ముందు సిటీ స్కాన్ చేయగా ఆమెకు సర్జరీ చేసిన భాగము పూర్తిగా సాధారణంగా ఉంది అని నిర్ధారణ చేశమని అన్నారు. తలలో కంతి ఏర్పడడం వల్ల తాను అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నానని, యశోద ఆసుపత్రి వైద్యులు రాజేశ్ బృందం తనకు ఆపరేషన్ చేసి పునర్జన్మను ప్రసాదించారని బాధితురాలు పేర్కొన్నారు.
