- అసలైన పేదలకు అన్యాయం జరిగింది
- న్యాయం చేయాలని కలెక్టర్ వినతి
Allegations of corruption in double bedroom housing distribution at Khanapur: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని కొమరం భీమ్ చౌరస్తాలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ పంపిణీలో అవినీతి, అక్రమాలు జరిగాయని దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని సీపీఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ, బహుజన కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిర్మల్ కలెక్టర్‌కు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎం.ఎల్)న్యూ డెమోక్రసీ ఖానాపూర్ డివిజన్ కార్యదర్శి సునారికారి రాజేష్, బహుజన కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి పసుపుల వెంకన్నలు మాట్లాడుతూ, ఖానాపూర్ కొమరం భీం చౌరస్తాలో గత ప్రభుత్వంలో నిర్మించినటువంటి డబల్ బెడ్రూంలో ఇండ్ల పంపిణీలో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఈ విషయమై తక్షణమే విచారణ చేసి చర్యలు తీసుకోవలసిన అవసరం ఉండని అన్నారు.
డబల్ బెడ్‌రూమ్‌లో పేదల కోసం కేటాయించిన వాటిని పేదలకు ఇవ్వకుండా, ధనవంతులకు, భూములు, జాగలు ఉన్న వారికీ ఇవ్వటం లో అంతరమేమిటని ప్రశ్నించారు. ఇప్పటికే అనేకసార్లు కలెక్టర్, అధికార యంత్రాంగానికి దృష్టికి తీసుకువస్తే సమస్యను పరిష్కరిస్తామని హామీలిస్తూ, అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ఈ సమస్యను పరిష్కరించాలని, అదేవిధంగా అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ కేటాయించాలని డిమాండ్ చేశారు. డబల్ బెడ్ రూమ్ సర్వే పూర్తి అయిందని, ఈ సమస్యను త్వరలో పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గం లింగన్న, డబల్ బెడ్‌రూమ్ సాధన కమిటీ కన్వీనర్లు, తోట రాధ, గౌస్, మజీద్ ఖాన్, సయ్యద్ షాదుల్లా, ఆత్రం కమల, ఓర్సు లక్ష్మి, తాళ్ల రుక్మ తదితరులు పాల్గొన్నారు.