road accident: నిర్మల్, అక్టోబర్ 9 (మన బలగం): నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం మన్మథ్ గ్రామానికి చెందిన తండ్రీ కొడుకులు సంగెం సురేశ్, దీక్షిత్ కారు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. సంగెం సురేశ్ తన స్వగ్రామంలో విద్యుత్ సబ్ స్టేషన్లో ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. దసరా సెలవుల నేపథ్యంలో తన కుటుంబంతో కలిసి ఆదిలాబాద్ జిల్లా కుచలాపూర్‌కు వెళ్లారు. బుధవారం ఉదయం విధులు నిర్వహించేందుకు తిరిగి కారులో బయలుదేరారు. భైంసా రహదారిపై నర్సాపూర్(జి) మండలం తురాటి గ్రామ సమీపంలో కారు అదుపు తప్పి చెట్టును ఢీ కొన్నది. ఈ ఘటనలో దీక్షిత్ (7) సంఘటనా స్థలంలో మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ సురేశ్ (27) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. భార్య, కూతురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో మన్మథ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.