Minister Seethakka: నిర్మల్, జనవరి 31 (మన బలగం): ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని జల్, జంగల్, జమీన్ నినదించి హక్కుల కోసం పోరాడి అమరులైన ఇంద్రవెల్లి ఆదివాసి వీరులకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క, ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ ఘన నివాళుర్పించారు. ఈ సందర్భంగా సాంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండె విఠల్, కరీంనగర్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశ్, మాజీ ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఆదిలాబాద్ పార్లమెంటు ఇన్‌చార్జి ఆత్రం సుగుణ, ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.