- మూసి ప్రక్షాళనకు రూ.1.50 వేల కోట్లు
- రైతు భరోసాకు రూ.15 వేలు లేవా?
- అన్ని రకాల ధాన్యానికి రూ.500 బోనస్ ఇవ్వాలి
- అభివృద్ధికి కేరాఫ్ కేసీఆర్ పాలన
- పార్టీ మారిన ఎమ్మెల్యేలు రైతు భరోసాపై వివరణ ఇవ్వాలి
- రైతు భరోసా ఖాతాల్లోకి చేరే వరకు పోరాటం ఆగదు
- జిల్లా పరిషత్ తొలి చైర్‌పర్సన్ దావ వసంత సురేశ్
BRS protest: జగిత్యాల, అక్టోబర్ 20 (మన బలగం): ప్రజల ఆదరణ కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ఆరు గ్యారంటీలను 420 హామీలను ఇచ్చి ప్రజలను మోసగించ్చిందని రైతు భరోసాపై ప్రజలకు భరోసా పోయిందని జిల్లా పరిషత్ తొలి చైర్‌పర్సన్ దావ వసంత సురేశ్ అన్నారు. ఆదివారం వర్షాకాలం రైతు భరోసాను ఎగ్గొట్టి రైతాంగాన్ని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై నిరసనగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసిల్ చౌరస్తా వద్ద దిష్టి బొమ్మ దహనం చేసి నిరసన తెలిపిన తదుపరి జగిత్యాల జిల్లా పరిషత్ తొలి చైర్ పర్సన్ దావ వసంత సురేశ్ మాట్లాడుతూ.. భారత రాష్ట్ర సమితి ఆదేశాల మేరకు రాష్ట్ర రైతంగం పక్షాన పోరాటం చేయడం జరిగిందన్నారు. జగిత్యాల జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు నిరసనలకు పిలుపునివ్వడం జరిగిందని పేర్కొన్నారు.
ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన, స్వల్ప విరామం లేకుండా గౌరవ కేటీఆర్ హరీశ్ రావు, మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రజాక్షేత్రంలో రైతుల పక్షాన ప్రజల పక్షాన పోరాటం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రైతు బంధును రైతు భరోసాగా పేరు మార్చి 10 వేల నుంచి 15 వేలకు పెంచి భరోసా కల్పిస్తామన్నారు. నిన్నటి వ్యవసాయ శాఖ మంత్రి వ్యాఖ్యలు వింటే మేనిఫెస్టోలో రాతలకే పరిమితం అన్నట్లుగా రైతు భరోసా మారిందని అర్థం అవుతుందన్నారు. అధికారంలోకి రావడానికి మాత్రమే ఆరు గ్యారంటీలు – 420 హామీలిచ్చారన్నారు. రైతుల ఓట్లతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చాక అడుగడుగునా రైతులను అణచివేస్తూ దమన నీతికి పాల్పడుతోందన్నారు. రైతుల అరిగోస పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మోసపోవద్దు – గోసపడొద్దు కేసీఆర్ సర్కార్‌ను కాదంటే రైతు బంధుకు రాం రాం అంటారని ఎన్నికల సమయంలో కేసీఆర్ చెప్పాడన్నారు. తెచ్చుకున్న తెలంగాణ రాబందుల పాలు అయితదని పేర్కొన్నట్లుగానే అదే తోవలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలనా సాగిస్తుందన్నారు. పంట రుణమాఫీ పూర్తి స్థాయిలో చేసే వరకు, రైతు భరోసా ఇచ్చే వరకు రైతులకు అండగా బీఆర్‌ఎస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. సన్న రకాలకు కాదు అన్ని రకల వరి ధాన్యానికి రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మూసి ప్రక్షాళనకు రూ.1లక్ష 50వేల కోట్లు ఎట్లా వస్తాయని, రైతు భరోసాకు రూ.15 వేలు ఎందుకు దొరకడం లేదు అనేది రైతంగానికి సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కరోనా విపత్కర పరిస్థితిలో సంక్షేమ అభివృద్ధి ఆపకుండా నడిపిన ఘనత కేసీఆర్ ప్రభుత్వందేనని కొనియాడారు.
ఉద్యోగులు, నిరుద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తూ, నిరుద్యోగులపై లాఠీలు ఝళిపిస్తూ రౌడీ పాలన చూపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు భరోసా విడుదల చేసే వరకు రైతుల పక్షాన కాంగ్రెస్ నాయకులను, ప్రజాప్రతినిధులను నీలాదీస్తామని హెచ్చరించారు. రైతు పక్షపాతి రేవంత్ రెడ్డి అని పార్టీ మారిన ఎమ్మెల్యేలు రైతులకు సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని మాజీ జడ్పి చైర్మన్ దావ వసంత సురేశ్ అన్నారు.
కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, జగిత్యాల మాజీ ఏఎంసీ చైర్మన్ శీలం ప్రియాంక ప్రవీణ్, బిఆర్ఎస్ పార్టీ అర్బన్ మండల అధ్యక్షుడు తుమ్మ గంగాధర్, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ రావు, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, ఉపాధ్యక్షుడు వొల్లెం మలేశం, రూరల్ మండల సమన్వయ కమిటీ సభ్యులు ఆనంద్ రావు, పడిగెల గంగారెడ్డి, పూదరి శ్రీనివాస్, చిత్తారి శ్రీనివాస్, గంగారాం, మాజీ సర్పంచ్ బుర్ర ప్రవీణ్ గౌడ్, అర్బన్ మండల యూత్ అధ్యక్షుడు సన్హిత్ రావు, రూరల్ మండల యూత్ ప్రధాన కార్యదర్శి బాలే చందు, మహిళ నాయకులు లక్ష్మి, సులోచన, గోవిందుపల్లె లక్ష్మి, నాయకులు కమలాకర్ రావు, చింతల గంగాధర్, రవీందర్ రావు, వెంకటేశ్వర్ రావు, కిషోర్, రాజేశ్వర్ రావు, రామకిషన్, మల్లయ్య, రామస్వామి, మోహన్, గాజుల శ్రీనివాస్, నక్క గంగాధర్, రిజ్వాన్, పట్టణ యూత్ నాయకులు ప్రణయ్, నీలి ప్రతాప్, సుమన్, మనోజ్, మోహన్, మణి, రైతులు, బీఆర్ఎస్ పార్టీ పట్టణ, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.