road accident: నిర్మల్, జనవరి 18 (మన బలగం): నిర్మల్ నియోజకవర్గం మామడ మండలం బూరుగు పల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బోల్తా పడి ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మధ్యప్రదేశ్ నుంచి శ్రీశైలం వెళుతున్న ఈ కారు అడ్డుగా వచ్చిన కోతులను తప్పించే ప్రయత్నంలో బోల్తా పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో విజయ్(65) అక్కడికక్కడే మృతిచెందారు. సునీత(55) నిర్మల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
