Nirmal rains damaged roads culverts repairs MLA Eleti Maheswar Reddy Swarna Project: నిర్మల్, ఆగస్టు 19 (మన బలగం): నిర్మల్ నియోజకవర్గంలో వర్ష ప్రభావం వల్ల దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అధికారులకు సూచించారు. సారంగాపూర్ మండలం జాం గ్రామ సమీపంలో గల కల్వర్టు ను బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల కల్వర్టులు వరద నీటి ఉధృతికి దెబ్బతిన్నాయని, తిరిగి త్వరితగతిన వాటికి మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మండలంలోని స్వర్ణ ప్రాజెక్ట్‌ను పరిశీలించారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో – ఔట్ ఫ్లో సంబంధిత వివరాలను అధికారులకు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, నాయకులు రావుల రాంనాథ్ తో పాటు జిల్లా, మండల, పట్టణ బీజేపీ నాయకులు కార్యకర్తలు అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

