World Photography Day Nirmal Photographers Association Vrudhashram Annadanam: నిర్మల్, ఆగస్టు 19 (మన బలగం): బాల్యంలో తీసుకున్న చిత్రం వృద్ధాప్యంలో చూసుకుంటే ఆ ఆనందం మరోలా ఉంటుంది. చిత్రం చిర కాల జ్ఞాపకంగా నిలిచిపోతుందని ఫోటో వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సగ్గం వంశీ అన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రియదర్శిని నగర్ లోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నిర్మల్ ప్రొఫెషనల్ ఫొటో, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు, ఫొటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగురే చిత్ర పటానికి సంఘ సభ్యులంతా నివాళులు అర్పించారు. అనంతరం మిఠాయిలు పంచుకుని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నిర్మల్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు సగ్గం వంశీ హాజరవగా, నిర్మల్ పట్టణ సంఘం అధ్యక్షులు కుమ్మరి శేఖర్, ప్రధాన కార్యదర్శి ధనలకోట కృష్ణవర్మ, కోశాధికారి దొంతుల గంగాధర్, కార్యవర్గ సభ్యులు, ముఖ్య సలహా సభ్యులు పట్టణ ఫొటో గ్రాఫర్లు పాల్గొన్నారు.
