Prabhas Raja saab: ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా రాజాసాబ్ మూవీ యూనిట్ చిత్రానికి సంబంధించిన మోషన్ పిక్చర్‌ను రిలీజ్ చేసింది. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మాళవికా మోహన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. మోషన్ పోస్టర్‌కు సంబంధించిన స్పెషల్ వీడియోను విడుదల చేశారు. టైటిల్‌కు తగ్గట్లు రాజు లుక్‌లో ప్రభాస్ పవర్‌ఫుల్‌గా కనిపించారు. సింహాసనంపై గంభీరంగా చూర్చొని చేతిలో సిగార్‌తో స్పెషల్ అట్రాక్షన్‌తో అభిమానులను అలరించనున్నట్లు తెలుస్తోంది. హారర్, కామెడీ ప్రధానంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. రాజాసాబ్ అప్డేట్ కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా గ్రాండ్ గిఫ్ట్ ఇచ్చినట్లైది. ఇటీవల ప్రభాస్ లుక్‌కు సంబంధించి విడుదల చేసిన పోస్టర్ క్షణాల్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అందులో గళ్ల చొక్కా, కళ్లద్దాలతో చాలా స్టైల్‌గా కనిపించారు. ఇక నుంచి మూవీకి సంబంధించి తరచూ అప్డేట్స్ ఉంటాయని చిత్రవర్గాలు ప్రకటించాయి. పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న రాజాసాబ్ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.