Nirmal wooden toys artists financial support Telangana Forest Department: నిర్మల్, ఆగస్టు 30 (మన బలగం): నిర్మల్ జిల్లా ప్రాశస్యమైన నిర్మల్ కోయ బొమ్మలు, వాటిపై జీవనోపాధి పొందుతున్నటువంటి కళాకారులకు నిర్మల్ జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (టీజీ ఎఫ్‌డీపీ) వారు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఇందులో భాగంగా నిర్మల్ కొయ్యబొమ్మల సహకార సంఘం కోరిక మేరకు రూ.7 లక్షల విలువైన టాటా మ్యాజిక్ వాహనాన్ని, రూ.5 లక్షల వారి వనరుల కొనుగోలుకై శనివారం నిర్మల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ బాసర సర్కిల్ శరవానన్ చేతుల మీదుగా జిల్లా అటవీ కేంద్రంలో అందజేశారు. వాహనాన్ని వారి అవసరాల నిమిత్తం, వారి సరుకులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రవాణా చేసుకుంటూ మార్కెట్ చేసుకుంటూ ఆర్థిక లాభాలు సంపాదించుకోవాలని సీసీఎఫ్ సూచించారు. కార్యక్రమంలో నాగిని భాను జిల్లా అటవీ అధికారిని, నిర్మల్, రామకృష్ణారావు అటవీ క్షేత్ర అధికారి నిర్మల్, సంతోష్ కుమార్ డీఆర్వో నిర్మల్, నిర్మల్ కొయ్య బొమ్మల సహకార సంఘ సభ్యులు పాల్గొన్నారు.